బాలయ్య సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారా?

By iQlikMovies - May 25, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

భారీ మెజార్టీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార పీటమెక్కింది. కాబోయే సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుండి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎమ్యెల్యే పదవి బాలయ్యకు కొత్తేం కాకపోయినా, ఇంతవరకూ బాలయ్య ఎమ్మెల్యే పదవిలో ఉండి, తన నియోజక వర్గానికి పెద్దగా చేసిందేమీ లేదు.

 

కానీ, ఇప్పుడలా కాదు, ప్రతిపక్షంలో ఉండి బాలయ్య ఇదివరకటిలా ఉంటానంటే కుదరదు. బరువు, బాధ్యతలు మరింత మోయాల్సి ఉంది. మరింత ఏంటీ.? అసలు బరువు బాధ్యత ఇప్పుడే మరి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఓ వైపు ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య చేసిన సేవల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాల్లో దర్జాగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలు కూడా జోరుగా చేసేశారు బాలయ్య. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. టీడీపీ అధికారం పోగొట్టుకుంది. అదృష్టవశాత్తూ బాలయ్య గెలిచారు. గెలుపు బాగానే ఉంది.

 

కానీ, ఈ బరువు బాధ్యతల్ని బాలయ్య ఎంత వరకూ డీల్‌ చేయగలరు.? అనేదే ప్రశ్న. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాల్సిన ఈ తరుణంలో బాలయ్య సినిమాలు చేయగలరా.? ఒకవేళ చేయాల్సి వస్తే, ఎలా.? అది సాధ్యమయ్యే పనేనా.? అనుకుంటున్నారు. జనసేన ఘోర పరాజయం పాలవడం వల్ల జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కి ఎలాంటి సమస్యా లేదు. మళ్లీ వెళ్లి, ఆల్రెడీ కమిట్‌ అయిన సినిమాలు చేసుకునే అవకాశముంది పవన్‌ కళ్యాణ్‌కి. కానీ ఆయన ప్రజల్ని, రాజకీయాల్ని వదిలిపెట్టనంటున్నారు అది వేరే విషయం. మరి గెలిచిన నందమూరి సింహం పరిస్థితేంటీ.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS