నందమూరి బాలకృష్ణ రీమేక్ కథలు ఎంచుకోవడం తక్కువే. మహా అయితే బాలయ్య చేసిన వంద సినిమాల్లో పదో, పన్నెండో రీమేకులు కనిపిస్తాయి. బాలీవుడ్ నుంచి కథ ఎరువు తెచ్చుకోవడం బాలయ్య కెరీర్‌లో అస్సలు కనిపించలేదు. అయితే ఇప్పుడు బాలయ్య కెరీర్‌లో తొలిసారి ఓ హిందీ సినిమాని రీమేక్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం పింక్.
ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో అజిత్ రీమేక్ చేస్తున్నాడు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్లాన్ ఉంది. ఈ సినిమా హక్కులు దిల్ రాజు దగ్గర ఉన్నాయి. అమితాబ్ పాత్రలో బాలయ్య అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారు. నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే దిల్ రాజు మాత్రం బాలయ్య వైపే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రీమేక్ విషయంపై బాలయ్యతో దిల్‌రాజు సంప్రదింపులు కూడా జరుగుతున్నార్ట. అతి త్వరలో పింక్ రీమేక్ లో హీరో ఎవరన్నది తెలిసిపోతుంది.