'కాటమరాయుడు' సినిమా రేపే రిలీజ్. రీమేక్ సినిమానే అయినా కానీ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రీమియర్ షోల టిక్కెట్స్ భారీ వ్యయంతో అమ్ముడయిపోతున్నాయి. ఇక ఆన్ లైన్ బుకింగ్స్, ధియేటర్ బుకింగ్స్ అయితే హాట్ కేక్స్‌లా అమ్ముడయిపోతున్నాయి. రీమేక్ సినిమా అయినా కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ అంటున్నారు అభిమానులు. అందుకే ఈ మేనియాకి అడ్డుకట్ట వేయడం ఎవ్వరి వల్లా కావడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'ఖుషి', గబ్బర్ సింగ్' సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే కానీ, అవి సృష్టించిన ప్రభంజనాలు అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాకి కూడా అంచనాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లక్కీ మస్కెట్ శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇంతవరకూ తెలుగులో ఏ హీరో కూడా సినిమా అంతా పంచెకట్టులో నటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పూర్తిగా పంచెకట్టుతో కనిపించనున్నాడట. పంచెకట్టులో పవన్ చేసే ఫైటింగ్ సీన్లు ఎప్పటికీ మర్చిపోరని చిత్ర యూనిట్ చెబుతోంది. ఒరిజినల్‌లోని కాన్సెప్ట్‌ని మాత్రమే పైపైన టచ్ చేశారట కానీ సినిమా మొత్తం పవన్ స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా మార్చేశారంట. హుందా అయిన పాత్రే అయినా కానీ పవన్ సినిమాలో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ సినిమాలో ఉన్నాయట. ఇవన్నీ వింటుంటే సినిమాపై ఆశక్తి ఇంకా పెరిగిపోతోంది కదా. కానీ మరి కొద్ది గంటలు ఓపిక పట్టాల్సిందే తప్పదు మరి!