మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి వారసత్వాన్ని నిలబెట్టే హీరో మోక్షజ్ఞ అని వాళ్ల నమ్మకం. ఈమధ్య ఇంటర్వ్యూలో బాలయ్య కూడా మోక్షజ్ఞ ఎంట్రీపై ఆశలు చిగురించేలా మాట్లాడాడు. మోక్షజ్ఞ కోసం కొన్ని అద్భుతమైన కథలు సిద్ధం చేశామని, తన ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుందని ఆశలు రేపాడు.
అయితే... ఇప్పుడు మోక్షజ్ఞని చూస్తుంటే, హీరోగా చేయడానికి రెడీగా లేడేమో అనిపిస్తోంది. బాలయ్య 60 వ పుట్టిన రోజు వేడుకల్లో మోక్షజ్ఞ కనిపించాడు. బాలయ్యకు ఓ బహుమతి ఇస్తూ.. ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఆ ఫొటోలో మోక్షజ్ఞ ఇంకా బొద్దుగానే కనిపిస్తున్నాడు. ఆ ఫొటో చూసి అభిమానులంతా షాక్‌కి గురవుతున్నారు. తన బరువు తగ్గి, హీరో లుక్ రావడానికి కనీసం రెండేళ్లయినా పడుతుందేమో అనిపిస్తోంది. 2021లో మాత్రం మోక్షజ్ఞని తెరపై చూడలేం. 2022 వరకూ ఆగాల్సిందే. కాకపోతే.. ఇది వరకు మోక్షజ్ఞ మరీ బొద్దుగా ఉండేవాడు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు చాలా బెటర్ అనే చెప్పుకోవాలి.