అలా మొదలైంది సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మహిళా డైరెక్టర్ లలో తనకి కూడా సత్తా ఉందని చూపించింది నందిని రెడ్డి. జబర్ధస్త్, కళ్యాణ వైభోగమే లాంటి సినిమాలతో కొంచెం వెనకపడినా, సరైన కథ, హీరో కోసం ఎదురు చూస్తుంది.
తాజాగా ఆమె పేస్ బుక్ లో ఉన్న ఫాన్స్ తో కొద్దిసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. మేడమ్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు, మీ కాంబో లో లవ్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాను అని అభిమాని అడిగిన ప్రశ్నకు, అతనితో 'గుండమ్మ కథ' సినిమా రీమేక్ చేయాలని వుంది అని తెలిపింది.
ఈతరం హీరోలలో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అతని హావభావాలు, స్టైల్, డాన్స్ అన్నీ కలిపి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా కనిపిస్తాడు అన్నారు ఆమె. గుండమ్మ కథ సినిమా రీమేక్ విషయంలో ఎన్టీఆర్ చాలా సార్లు మాట్లాడుతూ, తన తాత గారు, ఏఎన్నార్ కలిసి నటించిన ఈ సినిమాని నేను, నాగ చైతన్య కలిసిచేయాలనుకున్నాం. కానీ గుండమ్మ గా నటించిన సూర్య కాంతం పాత్ర కోసం తమకి ఎవరూ తట్టడం లేదని, అందుకే ఆ ప్రాజెక్ట్ ని విరమించుకున్నామని ఎన్టీఆర్ ఇదివరకే తెలిపాడు.