నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న "అక్షర" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గతంలో విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. ‘‘ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన కథ ఇది. నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండానే అద్భుతమైన మెసేజ్ తో వస్తోన్న అక్షర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన టీజర్, పాటకు వచ్చిన స్పందన మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇక సినిమా కూడా ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాం. ఇక సినిమాను అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.