ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన సమంత, విదేశాల్లో మామ నాగార్జున బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసి ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సెలబ్రేషన్ ఫోటోల్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది సమంత. ఓ గ్రూప్ ఫోటోతో సహా, సోలోగా మరో రెండు ఫోటోలు పోస్ట్ చేసింది సమంత. సోలో ఫోటోల్లో కిర్రాక్ పుట్టించేస్తోంది సమంత. బ్లాక్ కలర్‌లో అద్దాలు పొదిగిన డ్రస్ ఇది.
మోకాలి పైకే ఉంది. కానీ, ఈ డ్రస్సు వేసి, చేతిలో మెరిసిపోతున్న మెటాలిక్ బెలూన్స్ పట్టుకుని, లాంగ్ వ్యూలో సమంత ఇచ్చిన పోజు కేక పుట్టిస్తోంది. ఫ్యాషన్ ప్రియుల్ని ఇట్టే ఆకర్షించేస్తోంది. ఫ్యాన్స్‌నీ, కుర్రోళ్లనీ కేక పుట్టించేస్తోంది. సమంత బ్యాక్ వ్యూ అందమైన సీనరీని తలపిస్తోంది. చూపరుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పోజుల్లో సమంత స్వీట్ స్మైల్ ఇస్తూ, బ్రైట్ లుక్స్‌లో కనిపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇండియాకి తిరిగొచ్చాక సమంత '96' రీమేక్ షూటింగ్‌లో పాల్గొననుంది.
మామ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిమిత్తం, షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సమంత, తిరిగి రాగానే షూటింగ్‌లో జాయిన్ కానుందట. ఇక చైతూ విషయానికి వస్తే, చైతూ చాలా బిజీ. చేతి నిండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు 'వెంకీ మామ'లో నటిస్తూనే, శేఖర్ కమ్ములతో ఓ సినిమాని లైన్‌లో పెట్టేసిన సంగతి తెలిసిందే. అదీ సంగతి.