'కుమారి 21 ఎఫ్' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. తొలి సినిమాకే చాలా బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హెబ్బా పటేల్‌కి మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ స్థాయిలో హెబ్బా పేరు తెచ్చుకోలేదు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఆమె కెరీర్‌లో మరో మంచి హిట్‌గా నిలిచింది.
ఇక ఇప్పుడు హెబ్బా పటేల్ ఏం చేస్తోందా.? అంటే పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ లేవు కానీ, తాజాగా ఓ అన్‌ఎక్స్‌పెక్ట్‌డ్ ప్రాజెక్ట్ ఒకటి హెబ్బాని వరించిందట. అదే 'భీష్మ'. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆల్రెడీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ లేడీ విలన్ రోల్‌ని డిజైన్ చేశాడట డైరెక్టర్ వెంకీ కుడుముల. ఆ క్యారెక్టర్‌లో హెబ్బా పటేల్‌ని ఎంచుకున్నారట. ఇంకేముంది? మన కుమారి ఇరగదీసేయ్యదూ. ఆ క్యారెక్టర్ కోసం ఆల్రెడీ కసరత్తులు స్టార్ట్ చేసేసిందట.
సినిమాకి ఈ పాత్ర చాలా కీలకమట. ప్రాధాన్యత కూడా ఎక్కువేనట. మన హెబ్బా పటేల్ పంట పండిపోయినట్లే కదా. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమాని ఏ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఛలో'తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. సో చూడాలి మరి, తొలిసారి నెగిటివ్ టచ్‌లో దర్శనమిస్తున్న హెబ్బా.. ఆడియన్స్‌ని అబ్బా అనిపిస్తుందో లేదో.!