రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ బట్‌ ప్రమోషన్‌ హుషార్‌.!

By Inkmantra - March 23, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

సుమంత్‌ అశ్విన్‌, నందితా శ్వేత, సిద్దీ ఇద్నానీ జంటగా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న మూవీ 'ప్రేమకథా చిత్రమ్‌ 2'. గతంలో సుధీర్‌బాబు హీరోగా వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్‌'కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా ఆల్రెడీ విడుదల కావల్సి ఉంది. అయితే కొంత ప్యాచ్‌ వర్క్‌ పెండింగ్‌ ఉండడంతో రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పోన్‌ చేశారు. ఏప్రిల్‌ 6న 'ప్రేమకథా చిత్రమ్‌ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇదిలా ఉంటే, ఈ లోగా ఈ సినిమాకి ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. టీషర్టులు, వాల్‌ క్లాక్స్‌, గ్లాసులు మొదలైన వాటితో ఈ సినిమాకి ప్రమోషన్స్‌ నిర్వస్తున్నారు. ఆయా వస్తువులపై 'ప్రేమకథా చిత్రమ్‌ 2' పోస్టర్లు వేసి గ్రాండ్‌గా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. నిజానికి పెద్ద సినిమాల విషయంలోనే ప్రమోషన్స్‌ని ఇంత గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. అలాంటిది సుమంత్‌ అశ్విన్‌ సినిమాకి ఈ రేంజ్‌లో ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారంటే సినిమాపై చిత్రయూనిట్‌కి ఎంతో నమ్మకం ఉండి తీరాలి. 

 

టీజర్‌కి అయితే సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పోస్టర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. జోనర్‌ పాతదే అయినా సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాని తెరకెక్కించామని యూనిట్‌ చెబుతోంది. ఘన విజయం సాధించిన 'ప్రేమకథాచ్కితమ్‌' పార్ట్‌ 1కి ఏమాత్రం తీసిపోకుండా, అంతకు మించి అనే రేంజ్‌లో ఈ సినిమాతో ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నామని ఆడియన్స్‌కి భరోసా ఇస్తున్నారు 'ప్రేమకథా చిత్రమ్‌ 2' టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS