'అర్జున్‌ సురవరం' ఇలా.. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అలా..!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ద్‌ నటించిన 'అర్జున్‌ సురవరం' సినిమా విడుదల తేదీలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అయితే ఎలక్షన్స్‌ హీట్‌ హాట్‌గా ఉన్న ఈ తరుణంలో 'అర్జున్‌ సురవరం' విడుదలపై అంతగా పోజిటివ్‌ వైబ్స్‌ లేకపోవడంతో చిత్ర యూనిట్‌ వెనక్కి తగ్గారనీ తెలుస్తోంది. వెనక్కి తగ్గడం అయితే తగ్గారు కానీ, ఏ టైంని రిలీజ్‌కి ఫిక్స్‌ చేయాలో తెలియని సందిగ్ధంలో చిత్ర యూనిట్‌ ఉందట. 

 

మీడియా నేపథ్యంలో తెరకెక్కిన 'అర్జున్‌ సురవరం' ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ మోస్తరు అంచనాలైతే ఈ సినిమాపై ఉన్న మాట వాస్తవమే. అయితే రిలీజ్‌ వెనక్కి వెళ్లిందని వస్తున్న గాసిప్స్‌లో నిజమెంతో తెలియాలి మరి. ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రావల్సిన రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకీ టీడీపీ వర్గాల నుండి వ్యతిరేకత ఎక్కువవడంతో రిలీజ్‌ విషయంలో ఇదే సందిగ్థత నెలకొంది. సో 'అర్జున్‌ సురవరం' ఇలా, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అలా.

 

ఇక అదే రోజు విడుదల కాబోయే సినిమాల్లో ముచ్చటగా మూడో చెప్పుకోదగ్గ సినిమా 'సూర్యకాంతం'. క్యాజువల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 29న 'సూర్యకాంతం' రావడం పక్కా. ఈ క్రమంలో ఈ నెల 23న 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఈ సినిమాకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS