నందితా శ్వేత అంటే చాలు దెయ్యం పాత్రలే గర్తొచ్చేలా ముద్ర పడిపోయింది ఇంతవరకూ ఆమె నటించిన సినిమాల దృష్ట్యా. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా మినహాయించి ఇంతవరకూ నందితా శ్వేత నటించిన సినిమాలన్నీ హారర్ బేస్‌డ్ మూవీసే కావడం విశేషం. తాజాగా నందితా శ్వేత 'అక్షర' అనే మరో సినిమాతో రాబోతోంది. ఈ సినిమాలోనూ అక్షరా దెయ్యమే అని ప్రచారం జరిగిందింతవరకూ. కానీ, లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ని బట్టి అక్షర ఈ సినిమాలో దెయ్యం కాదని ప్రూవ్ అయ్యింది.
రత్తాలు లక్ష్మీరాయ్ నటించిన 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' కథని చూచాయగా పోలినట్లుంది 'అక్షర' కథనం. అయితే, ఆ సినిమాలో లక్ష్మీరాయ్ దెయ్యమే. కానీ ఈ సినిమాలో నందితా దెయ్యం కాదు. జస్ట్ టీచర్ మాత్రమే. గ్లామర్‌కి ఎక్కడా చోటున్నట్లుగా కూడా కనిపించలేదు. హుందాగా కనిపిస్తోంది. ఇక కథ విషయానికొస్తే, ఒక ఊరు, ఆ ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లూ (షకలక శంకర్, మధునందన్, సత్య), అదే ఊరికి టీచర్‌గా వచ్చిన అక్షర (నందితా శ్వేత), ఆమె నుంచి వీరు ఏదో ఊహిస్తే, ఇంకేదో జరిగి వారు ప్రమాదాల్లో పడతారు.
దాంతో టీచర్‌ని కిడ్నాప్ చేసి హత్య చేసే ఆలోచన చేస్తారు. ఆ క్రమంలో వారికి అక్షర గురించిన ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటీ.? అసలు అక్షర ఆ ఊరికే కావాలని ఎందుకొచ్చింది.? ఈ ముగ్గురితో స్నేహంగా ఎందుకు మసలింది.? అనేది తెలియాలంటే 'అక్షర' చూడాల్సిందే. ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బి.చిన్నికృష్ణ ఈ సినిమాకి దర్శకుడు. త్వరలో విడుదల తేదీ ఖరారు కానుంది.