సన్నగా పడుతోన్న వర్షం, ఓ స్టూడియో.. ఫోటో తీయించుకోవడానికి వెళ్లిన 70 ఏళ్ల బామ్మ.. ఏం జరిగిందో తెలీదు.. పడుచు పిల్లలా బయటికొచ్చింది. కట్ చేస్తే 'ఓ బేబీ' ట్రైలర్. 'బేబీ ఇప్పుడు 70 ఏళ్ల ముసల్ది కాదు, 24 ఏళ్ల పడుచు పిల్ల.. అంటూ రాజేంద్రప్రసాద్ డైలాగులతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. రావు రమేష్‌కి బేబీ గురించిన నిజాల్ని రాజేంద్రప్రసాద్ వివరిస్తూంటాడు. ఇంతలో భామగా మారిన బామ్మ.. పడుచు వయసులో ఉన్నా, బామ్మ తాలూకు లక్షణాలు.. పడుచు పిల్లనుకుని, సైటు కొట్టే కుర్రాళ్లూ.. అందులో ఆమె మనవడు కూడా ఉంటాడు.
ప్రపోజ్ చేయబోతే.. పైకి చెప్పలేక.. 'మీ నాయనమ్మనురా.. అని సమంత లోపల గొణుక్కునే డైలాగ్స్.. నవ్వు తెప్పిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ టచ్చింగ్‌గా ఉన్నాయి. ట్రైలర్‌తో మొత్తం కథని చెప్పే ప్రయత్నం చేసింది డైరెక్టర్ నందినీ రెడ్డి. 'దేవుడు మళ్లీ వయసిచ్చాడు.. ఆ వయసు రెక్కలు విప్పుకుంటోంది..' అంటూ సెంటిమెంట్ టచ్‌తో సమంత చెబుతున్న డైలాగ్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. నాగశౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యంగ్ హీరో అడవిశేష్ గెస్ట్ అప్పీల్ ఇస్తున్నాడు.
కామెడీ, ఎమోషన్.. మనసును హత్తుకునే కథా, కథనాలు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయం 'ఓ బేబీ'లో ఉంది. సమంతకు ఈ సినిమా ఖచ్చితంగా మరో హిట్ ఖాయం. 100 కి 100 మార్కులు వేయించుకునేలా ఉంది ట్రైలర్. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది 'ఓ బేబీ'. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాపై ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు సూపర్ హిట్‌ని కన్‌ఫామ్ చేసేస్తున్నాయి. జూన్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.