'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నందితా శ్వేత. తొలి సినిమా అయినా ఆ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులేయించుకుంది. ఎక్స్‌ప్రెసివ్ లుక్స్, ఆకట్టుకునే ఫిజిక్‌తో అందర్నీ మెప్పించింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మను లీడ్ రోల్‌లో పెట్టి మరో థ్రిల్లర్ మూవీని తెరకెక్కించేందుకు డైరెక్టర్ చిన్నికృష్ణ ఓ స్క్రిప్టు ప్రిపేర్ చేశారు. ఆ దిశగా ఈ ప్రాజెక్టును ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. 'అక్షర' టైటిల్‌తో హీరోయిన్ ఓరియెండెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సినీ మహల్ బ్యానర్‌లో రూపొందనుంది. సినిమా ఓపెనింగ్ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్‌రాజు ఫస్ట్ క్లాప్‌నిచ్చారు.
డిశంబర్ నుండి సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్‌లతో ఎన్ని సినిమాలొచ్చినా, ఇంకా ఏదో కొత్తగా చూపించే ఆలోచనలు చేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. ప్రేక్షకులు కూడా థ్రిల్లింగ్ అంశాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రైటర్‌గా పేరు తెచ్చుకుని, కొన్ని చిన్న సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ చిన్నికృష్ణ ఒకటి రెండు సినిమాల్లో నటుడిగానే మెప్పించాడు. ఇక లేటెస్టుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్‌గా మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.
ఇక మలయాళ బ్యూటీ నందితా శ్వేత విషయానికి వస్తే, ఈ చిన్నది మాంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్నది. కరెక్ట్‌గా వాడితే అమ్మడిలోని అపురూపమైన టాలంట్ బయటికి వస్తుంది. ఆల్రెడీ అది 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో ప్రూవ్ అయిపోయింది. అన్నట్లు ఇటీవల విడుదలైన దిల్‌రాజు మూవీ 'శ్రీనివాస కళ్యాణం'లో నందితా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. చూడాలి మరి 'అక్షర'తో నందితా మరోసారి ఆకట్టుకుంటుందేమో.!