'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో టాలీవుడ్‌కి తెరంగేట్రం చేసిన మలయాళీ ముద్దుగుమ్మ నందితా శ్వేత. తొలి సినిమాకే బెస్ట్ పర్ఫామెన్స్ క్యారెక్టర్ పడడంతో తన తడాఖా ఏంటో చూపించేసింది. అయితే తర్వాత సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది నందితా శ్వేత. ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతోంది.
తెలుగులో సుధీర్‌బాబు, నందిత జంటగా వచ్చిన 'ప్రేమకథా చిత్రం' సినిమా మంచి విజయం అందుకుంది. ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఆ సీక్వెల్ కోసం నందితా శ్వేతను ఎంచుకున్నారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట. అలాగే తమిళంలో ఘన విజయం సాధించిన 'సదురంగవేట్లై' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలోనూ నందితా శ్వేతనే హీరోయిన్ అట. ఇలా వరుసపెట్టి తెలుగులో ఆఫర్లు అందుకుంటోంది ముద్దుగుమ్మ నందితా శ్వేత.
ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందంటోంది. ఇకపోతే తాజాగా నందితా శ్వేత 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో నందితా హాట్‌గా కనిపించబోతోందని వార్తలు వెలువడ్డాయి. కానీ అదేం లేదట. చక్కగా పల్లెటూరి అమ్మాయిలా అందంగా కనిపిస్తుందట. గ్లామర్ పెద్దగా ఉండదంటోంది.
నందితా నుండి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకు ఈ వార్త కాస్త నీరసించేదే కానీ, భవిష్యత్తులో గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు తనకేం అభ్యంతరాలు లేవని ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది అందాల నందితా శ్వేత.