పన్నెండు మంది సినీ సెలబ్రిటీలు 'సిట్' బృందం ముందు విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ఎక్సయిజ్ శాఖ తెలంగాణ నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో 20 మందికి పైగా డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేసింది. అయితే సినీ పరిశ్రమకు చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసి, విచారించి సరిపెట్టింది. పూరి జగన్నాథ్‌తో విచారణ ప్రారంభం కాగా, నందుతో ఈ విచారణ ముగిసింది. అరెస్టులంటూ ప్రచారం జరిగింది. అయితే ఎవర్నీ 'సిట్' అరెస్ట్ చేయలేదు. కొందరిని రాత్రి 10 గంటల వరకు విచారించగా, కొందరిని సాయంత్రం ఐదు గంటల సమయానికే విచారణ ముగించి పంపించేశారు. అందరికంటే తక్కువ సమయం విచారణ ఎదుర్కొన్నది హీరో నందునే. నందు విచారణని ఎదుర్కొని చాలా సంతోషంగా బయటికి వచ్చాడు. మొత్తానికి పూరీ జగన్నాధ్‌తో మొదలైన సిట్ విచారణలు, నందుతో పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రెండో లిస్ట్ ఉందని ఇంకొందరు ప్రముఖులకు నోటీసులు అందుతాయని టాక్ వినవస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే ఈ డ్రగ్స్ ఇష్యూ కొంత కామ్ అప్ అయ్యిందనిపిస్తోంది. అలాగే మరోపక్క నందు విచారణ పూర్తి కాగానే, ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి సిబ్బంది తాళాలు వేశారు. అంటే ఇప్పట్లో సిట్ విచారణలు లేనట్లేనా? ఏమో తెలీదు. రెండో లిస్ట్ విచారణలు ఎప్పుడు మొదలవుతాయనేది తెలియాల్సి ఉంది.