డిశంబర్ 21న నేచురల్ స్టార్ నాని సినిమా 'ఎంసీఏ' విడుదల కానుంది. అయితే ఆ తర్వాతి రోజే అఖిల్ రీ లాంఛింగ్ మూవీ 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కరోజు గ్యాప్‌లో వస్తున్న ఈ ఇద్దరి మధ్యా పోటీ ఉండబోతోందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మీడియా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ వార్తలు ప్రచురిస్తోంది.
అందుకే మిడిల్ క్లాస్ అబ్బాయి ఏం చేశాడంటే-. 'యుధ్దం నాకూ అఖిల్‌కీ మధ్య కాదు. సల్మాన్‌ఖాన్‌తో. ఈ క్రిస్‌మస్‌కి మిడిల్ క్లాస్ అబ్బాయి టైగర్‌కి హలో చెప్తాడు. అని ట్వీట్ చేశాడు నాని. అయితే ఇది నాని ఏ ఉద్దేశ్యంతో పెట్టినా.. ఆయన ట్వీట్ కి మాత్రం మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పాలి. ఇద్దరు తెలుగు హీరోల మధ్య మనస్పర్ధలు రాకూడదు అనే ఇలా పోస్ట్ చేసినా దీనికి రెస్పాన్స్ మాత్రం వేరే రకంగా వచ్చింది.
సల్మాన్ ఖాన్ ఫ్యాన్సే కాకుండా సాధారణ సినీ అభిమానులు కూడా నాని ఇలా తెలుగు-హిందీ సినిమా అంటూ వేరు చేయడం కరెక్ట్ కాదు అని అలాగే హిందీ సినిమాల మార్కెట్ తో పోలిస్తే తెలుగు సినిమా మార్కెట్ చాలా తక్కువ (బాహుబలి సినిమా మినహాయిస్తే) అనే విషయాన్ని నాని గుర్తించాలి అంటున్నారు.
ఇక సల్మాన్ ఖాన్ అభిమానులైతే, కొంచెం ఘాటుగానే- మా హీరో ఒక్క సినిమా షేర్ అంత కూడా వచ్చి ఉండదు నువ్వు ఇప్పటివరకు చేసిన సినిమాలకి కలిపి అని సెటైర్లు వేస్తున్నారు. పైగా హిందీ సినిమాలకి నైజం ఏరియాలో తప్ప వేరే ప్రాంతాల్లో మన దగ్గర అంతగా కలెక్షన్స్ రావు. అలాగే తెలుగు సినిమాలకి కూడా ఉత్తరాదిన అంతగా వసూళ్ళు రావు.
ఇటువంటి అంశాన్ని సున్నితంగా డీల్ చేసే పనిలో భాగంగా లేని పోనీ పోలికలు చేయడం పద్ధతి కాదు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. డిశంబర్ 22న సల్మాన్‌ఖాన్ నటించిన 'టైగర్ జిందాహై' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.