నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'వి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసమే నాని విదేశాలకు వెళ్లాడు. మరోవైపు నాని నటించిన 'గ్యాంగ్‌లీడర్' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాని తన షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి స్వదేశానికి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. 'గ్యాంగ్‌లీడర్' ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకే 'వి' సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఆ టైంలో నాని, నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దేవదాస్' సినిమా విడుదలైంది. ఈ సినిమాకి ప్రమోషన్‌గా నాగార్జున అండ్ టీమ్‌ని బిగ్‌బాస్ స్టేజ్ మీదికి తీసుకొచ్చాడు నాని. ఇప్పుడు నాని నటించిన 'గ్యాంగ్‌లీడర్' సినిమా ప్రమోషన్స్ నిమిత్తం నాని అండ్ హిజ్ గ్యాంగ్‌ని బిగ్‌బాస్ స్టేజ్‌కి తీసుకొచ్చి, కంటెస్టెంట్స్‌నీ, ఫ్యాన్స్‌నీ సర్‌ప్రైజ్ చేయనున్నారట నాగార్జున. అది ఈ వారమే అవుతుందో లేక, వచ్చే వారం అవుతుందో తెలీదు కానీ, ఈ మధ్య సెన్సేషనల్ హిట్ అందుకున్న 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ రామ్, నిధి అగర్వాల్‌ని తీసుకొచ్చి ఆల్రెడీ నాగార్జున సందడి చేయించారు.
ఇక ఇప్పుడు నాని అండ్ గ్యాంగ్ ఎలాంటి సందడి చేయనుందో చూడాలిక. ఇదిలా ఉంటే, ప్రమోషన్స్‌లో భాగంగా, నానిని బిగ్‌బాస్ చూస్తున్నారా? అనే ప్రశ్నకు వరుస షూటింగ్స్‌తో బిగ్‌బాస్‌ని కంటిన్యూస్‌గా ఫాలో కాలేకపోతున్నాననీ, టైం కుదిరినప్పుడు మాత్రం చూస్తున్నాననీ చెప్పాడు నాని. ఇక నాగార్జున హోస్టింగ్ అయితే 'కిల్లింగ్' అని కాంప్లిమెంట్ ఇచ్చాడు నాని.