తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత గాధని వెండితెరపై సినిమాగా ఆవిష్కరించేందుకు ఇప్పటికే పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు. ఆల్రెడీ తమిళంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ రూపొందుతోంది. హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్‌ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మరో బయోపిక్ రూపొందుతోంది. అయితే, ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్. గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఈ ఫస్ట్‌లుక్‌లో రమ్యకృష్ణను వెన నుండి చూపించారు. ఆమె కట్టూ బొట్టూ వెనక నుండి అచ్చు జయలలితనే తలపిస్తున్నాయి. ఓ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జయలలిత ఉపన్యాసమిస్తున్నట్లుగా ఉంది ఈ ఫస్ట్‌లుక్. సినిమాలతో పాటు, ఇప్పుడు వెబ్ సిరీస్‌కీ ప్రాధాన్యత దక్కుతోంది. ఆ కోణంలోనే జయలలిత బయోపిక్‌ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా రూపొందించాలని గౌతమ్ మీనన్ భావించారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ, ఎమ్ ఎక్స్ ప్లేయర్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గౌతమ్ మీనన్‌తో పాటు, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వంలో భాగం పంచుకున్న ఈ వెబ్ సిరీస్‌కి 'క్వీన్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తమిళనాడు ప్రజలతో 'అమ్మ' అని ఆప్యాయంగా పిలిపించుకున్న జయలలిత ఇప్పుడు రమ్యకృష్ణ రూపంలో 'క్వీన్'గా రాబోతోంది. చూడాలి మరి అమ్మని ఆదరించినట్లే, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో 'క్వీన్'ని కూడా ఆదరిస్తారేమో.!