నాని అలా ఫిక్సయిపోతాడా?

మరిన్ని వార్తలు

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అని చాలా మంది చెప్పగా వింటుంటాం. అలాగే నేచురల్‌ స్టార్‌ నాని కూడా ఏదో అవ్వాలనుకొని వచ్చి ఇంకేదో అయ్యాడు. ఇంకా ఏదో కావాలనుకుంటున్నాడిప్పుడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, ఎప్పటికైనా మంచి డైరెక్టర్‌ కావాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్టర్‌ కాదు, మంచి యాక్టర్‌ ఉన్నాడు తనలో అని గుర్తించి హీరోగా పేరు తెచ్చుకుని, పక్కింటబ్బాయ్‌ ఇమేజ్‌తో నాని సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ హిట్‌ అని దూసుకెళ్లిపోతున్న సమయంలో సడెన్‌గా కెరీర్‌కి ఒకానొక టైంలో బ్రేకులు పడ్డాయి.

 

దాంతో వరుస ఫెయిల్యూర్స్‌ రుచి చూడాల్సి వచ్చింది. మళ్లీ 'జెర్సీ'తో ఈ మధ్యనే ట్రాక్‌ ఎక్కాడు. ఆ ట్రాక్‌ని అదే స్పీడుతో కంటిన్యూ చేయాలని 'గ్యాంగ్‌ లీడర్‌' సబ్జెక్ట్‌ పట్టాలెక్కించాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తనదైన శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమా ద్వారా నాని చూపించబోతున్నాడు. ఈ సినిమాలో 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం కార్తికేయ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ నటనను మెచ్చుకున్న నాని, అతనితో కలిసి మరో సినిమాలో నటించాలనుకుంటున్నానని చెప్పాడు.

 

అయితే, హీరోగా కాదట. విలన్‌గా నటిస్తాడట. ఇప్పటికే నాని, సుధీర్‌ బాబుకు విలన్‌గా నటిస్తున్నాడు 'వి' చిత్రంలో. నాని మాటలు వింటుంటే, ఈ విలనిజానికి ఇప్పుడప్పుడే బ్రేకులు వేసేలా లేడనిపిస్తోంది. ఇంకా కొనసాగిస్తూనే ఉంటాడట. చూద్దాం విలన్‌గా తొలి సినిమా 'వి' సక్సెస్‌ అయితే, నాని విలనిజాన్ని ఆడియన్సే కావాలని ఎంకరేజ్‌ చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS