హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. టాస్క్‌లో భాగమే అయినప్పటికీ, పోరులో పర్సనల్ ఇష్యూస్ బయట పడుతున్నాయి. తాజాగా 'దెయ్యాలున్నాయ్ జాగ్రత్త' టాస్క్‌లో దెయ్యాల టీమ్ అయిన బాబా భాస్కర్, వితిక, హిమజ, శిల్పా చక్రవర్తి కలిసి, పునర్నవిని మోసుకొచ్చి లిటరల్‌గా లాక్కొచ్చి స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. కాసేపు నీళ్లలో అలాగే ఊపిరి బిగబట్టి ఉండిపోయింది పునర్నవి.
ఆ తర్వాత తేరుకుంది. ఏమైంది? అంతా ఓకేనా? అని దగ్గరికి వచ్చిన వరుణ్‌తో ఏంటిదంతా? అంటూ టాస్క్ శృతిమించిపోతోందనే తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చింది. కానీ, ఇది టాస్క్‌లో భాగమే అని వరుణ్ చెప్పేసరికి ఏం చేయాలో, ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియలేదు పునర్నవికి. ఇక చిట్ట చివరికి టాస్క్‌ని తప్పుపడుతూ, 'బుల్ షిట్ టాస్క్' అంటూ అభివర్ణించింది. ఇలాంటి టాస్క్‌లో ఆడడం నా వల్ల కాదు.. కావాలంటే బిగ్‌బాస్ నువ్వే ఆడుకో.. అని కెమెరాని చూస్తూ బిగ్‌బాస్‌కి గట్టిగా వార్న్ చేసింది.
బిగ్‌బాస్‌కి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే, ఈ టాస్క్ ఇంకా పూర్తి కాలేదు. ఈ రోజు కూడా కంటిన్యూ కానుంది. ఈ కంటిన్యూషన్‌లో ఇంకెన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలీదు కానీ, చేసిన తప్పుకు పునర్నవి, మహేష్‌లు శిక్షకు గురయ్యారు. ఇంతకీ వీరు చేసిన తప్పేంటీ.? బిగ్‌బాస్ వీరికి వేసిన శిక్ష ఏంటీ.? అనేది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.