బిగ్‌హౌస్ నుండి వచ్చిన సెలబ్రిటీ కిరీటి గొడవ పడి వెళ్లాడు. ఓ నటుడిగా అతనంటే చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటిది వరస్ట్ అని ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేసి బయటికి పంపించారు. భాను విషయంలోనూ అదే జరిగింది. ఎన్టీఆర్ టైంలో ఇలా జరగలేదు. మిగతా విషయాల్లో నానికి సంబంధం లేదు కానీ, ఇది 'మగతనం అనుకుంటున్నావా.?' అన్న మాట కిరీటిని తలచుకున్నప్పుడల్లా గుర్తుకొస్తునే ఉంది.
బయటికి వచ్చి ఎవరూ బిగ్‌బాస్ గురించి విమర్శలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బిగ్‌భాస్‌లో, జరుగుతున్న అంశాలపై నెటిజన్లు జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వాటిపై నాని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇదీ ఓ రకంగా బిగ్‌బాస్‌పై నెగిటివిటీ రావడానికి కారణమైంది. ఇలా నెగిటివిటీ రావడానికి ఓ రకంగా కారణం నానినే అని చెప్పాలి. హౌస్‌లో జరుగుతున్న, అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను నాని కట్టడి చేయలేకపోతున్నాడు. ఇది బిగ్‌బాస్‌కి తీరని మచ్చగా మారిపోయింది.
షో ప్రమోషన్ కోసం, కౌషల్, భానుపై చిత్రీకరించిన ఫైట్ ఓ వైపు కౌషల్ క్యారెక్టర్‌నీ, మరోవైపు భాను క్యారెక్టర్‌నీ డ్యామేజ్ చేసేసింది. తాజాగా బిగ్ హౌస్ నుండి బయటికి వచ్చిన తేజస్విని కూడా తన క్యారెక్టర్‌ని పూర్తిగా డ్యామేజ్ చేసుకునే బయటికి వచ్చింది. బిగ్‌స్క్రీన్‌పై సపోర్టింగ్ రోల్స్‌కి పెట్టింది పేరైన తేజు, 'బిగ్‌బాస్'కి వచ్చాక ఛీ తేజు అంటే ఇదా.? అనిపించేలా నెటిజన్స్ మనసులో క్రియేట్ అయ్యింది.
ఇలా బిగ్‌బాస్ నుండి బయటికి వచ్చిన వారంతా పర్సనల్‌గా తమ తమ క్యారెక్టర్స్‌ని బ్యాడ్ చేసుకుని రావల్సిందేనా? ఇంకొంచెం మసాలా.. ఏదైనా జరగొచ్చు అంటూ నాని ఇస్తున్న ట్యాగ్‌లైన్ ఎందుకోసం.? బిగ్‌బాస్ నిర్వాహకులు షో నిర్వహణపై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుంటుంది.