బిగ్ బాస్ కి రాం రాం చెప్పేసిన నాని!

మరిన్ని వార్తలు

న్యాచురల్ స్టార్ నాని తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఆయనకి బిగ్ బాస్ రూపంలో ఒక అరుదైన అవకాశం ఎదురైంది. ఈ తరుణంలో ఆయన బిగ్ బాస్ రెండవ సీజన్ కి హోస్ట్ గా చేశాడు.

ఇక అలా వ్యాఖ్యాతగా మారిన తరువాత ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. దానితో ఆయన తన సోషల్ మీడియా వేదికగా తన పైన వస్తున్న విమర్శలకి సమాధానం కూడా చెప్పడం జరిగింది.

ఇవ్వన్ని పక్కనపెడితే కౌశల్ ఆర్మీ పేరిట కొందరు నానిని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం పరిపాటైపోయింది. ఈ తరుణంలో ఆయన మరోసారి అదే బిగ్ బాస్ సీజన్ 3ని కూడా హోస్ట్ చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

అయితే నిన్న ఆయన తన సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ ప్రయాణంలో తనని ఇష్టపడ్డవారికి కృతజ్ఞతలు అని నచ్చనివారికి థియేటర్స్ లో కలుద్దాము అంటూ సీజన్ కి ముగింపునిచ్చేశాడు.

చివరగా.. ‘నాని’ని మరోసారి యాంకర్ గా చూడలేము అని అయితే చూచాయగా అర్ధమవుతుంది.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS