సింధు బయోపిక్‌కి రంగం సిద్ధం చేస్తున్న సోనూసూద్‌.!

మరిన్ని వార్తలు

శ్రద్ధాకపూర్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. లేటెస్టుగా సైనా నెహ్వాల్‌ పాత్రలో శ్రద్ధాకపూర్‌ రాకెట్‌ పట్టుకుని విజయ గర్వం చూపిస్తున్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. మరోవైపు రీసెంట్‌గా బ్యాడ్మింటన్‌ లో ఛాంపియన్‌గా పతకాల మీద పతకాలు సాధిస్తూ బోలెడంత క్రేజ్‌ సంపాదించుకున్న మరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పి.వి. సింధు బయోపిక్‌ని తెరకెక్కించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 

ఈ బయోపిక్‌ని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ రూపొందిస్తున్నారు. 2016లో రజత పతకం అందుకోవడంతో ఈ బయోపిక్‌కి ముగింపు ఇద్దామనుకున్నాడట సోనూసూద్‌. కానీ ఆ తర్వాత సింధు ఖాతాలో చాలా చాలా పతకాలు తోడయ్యాయి. అందులో ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లు, సాధించిన పతకాలు ఉన్నాయి. దాంతో మళ్లీ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందట. అతి త్వరలో ఈ బయోపిక్‌ని సెట్స్‌ పైకి తీసుకెళ్లనున్నారట సోనూసూద్‌. ఈ సినిమాకి సోనూసూద్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అలాగే పి.వి.సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో సోనూ సూద్‌ నటించనున్నట్లు సమాచారమ్‌. అయితే దర్శకుడు ఎవరు.? సింధు పాత్ర పోషించే నటి ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

గతంలో తమన్నా, ప్రభుదేవా జంటగా తెరకెక్కిన 'అభినేత్రి' సినిమా కూడా సోనూసూద్‌ సొంత బ్యానర్‌లోనే రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS