ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల సెబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ, తమకు తోచిన విధంగా వ్యక్తిగత జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా మోహన్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్ తదితర హీరోలు స్పందించారు. లేటెస్ట్‌గా నేచురల్ స్టార్ నాని కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే, నాని సమ్‌థింగ్ డిఫరెంట్‌గా రెస్పాండ్ అయ్యాడు. ‘పాలిటిక్స్, కులం, మతం, డబ్బు, అధికారం, ఫేమ్, తొక్కా తోలు ఏదీ ఉండదు. మనిషికి మనిషే చివరికి. అందరం సేమ్ ఫ్యామిలీ. ఎవరికి వారే జాగ్రత్త తీసుకోవాలి. బీ సేఫ్, బీ రెస్పాన్సిబుల్.. అంటూ దిమ్మ తిరిగే కామెంట్ చేస్తూ కాస్త గట్టిగానే రెస్పాండ్ అయ్యాడు.
పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి
— Nani (@NameisNani) March 17, 2020
మనిషికి మనిషే
We are all one big family and we need to take care of each other #BeResponsible #BeSafe
నాని రెస్పాన్స్ హర్షించదగ్గదిగా ఉంది. చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇకపోతే, ఈ కరోనా మహమ్మారి కారణంగానే నాని తన సినిమా రిలీజ్‌ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. లేదంటే, ఈ నెల 25న ‘వి’ ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానితో పాటు, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.