ఇటీవలే ధియేటర్స్‌కొచ్చిన ‘పిట్టకథ’కు కరోనా ఎఫెక్ట్ బాగా తగిలేసింది. సినిమాకి ఓ మోస్తరు పోజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఏం చేస్తాం.? కరోనా ఎఫెక్ట్‌తో ధియేటర్స్ మూసేయడం వల్ల ఈ సినిమాకి ఆశించిన రీతిలో కలెక్షన్లు రాబట్టలేకపోయారు. అయినా, మంచి సినిమాకి ప్రేక్షకుల ఆదరణ ఉండాలి కదా. అందుకే ‘పిట్టకథ’ను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించేందుకు అవకాశం కల్పించారు. ఇక నుండి ‘పిట్టకథ’ను ఎంచక్కా ఇంట్లోంచే చూసేయ్యొచ్చన్న మాట. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా డెబ్యూ చేశాడు.
‘దేవుళ్లు’ పిల్ల నిత్యా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అన్నీ బాగుంటే, సినిమాకి మంచి కలెక్షన్లు రాబట్టేదే. కానీ, కరోనా రూపంలో కాలసర్పం ఈ సినిమాని కాటేసింది. దాంతో చేసేది లేక, ఈ సినిమాని మిస్ అయ్యామని ఫీలవుతున్న ఆడియన్స్‌కి అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ అవకాశం కల్పించారు సినీ నిర్మాతలు. చూడాలి మరి, ప్రైమ్ ద్వారా ‘పిట్టకథ’ ఎంత క్యాష్ చేస్తుందో.