ఒక “కామన్ మ్యాన్” ట్యాగ్ తో బిగ్ బాస్ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్ పైన నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అదేంటంటే- గణేష్ శుక్రవారం చెవిపోటు వల్ల బిగ్ బాస్ ఇంటిలో తరచూ పడుకోవడం దీప్తి కెప్టెన్సీ పోవడానికి, కౌశల్-తనీష్ ల మధ్య వాగ్వాదం జరగడానికి కారణమయింది. దీనికి సంబంధించి నాని మాట్లాడుతూ- అసలు నీ ఆరోగ్యం పైన నీకు శ్రద్ధ లేకపోతే అసలు బిగ్ బాస్ గేమ్ ని శ్రద్ధతో ఎలా అడగలుగుతావు? కామన్ మ్యాన్ గా నువ్వు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చాక నీకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తో నీ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి.
దీనికి సంబంధించిన ఒక క్లిప్ చూపించి, అందులో మైక్ బ్యాటరీలు తీసి మరి మాట్లాడడం, ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ పైన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని పైన గణేష్ కి నాని పరోక్షంగా ఒక హెచ్చరిక కూడా జారీచేశాడు.
నువ్వు ఒక కామన్ మ్యాన్ కాకపోయి ఒక సెలబ్రిటీ అయి ఉంటే ఈ ఇంటి నుండి నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి. అసలు నువ్వు ఒక కామన్ మ్యాన్ అయిన ప్రధాన కారణంగానే ప్రేక్షకులు నువ్వు సరిగాఉండకపోయినా నీకు ఓట్లు వేస్తున్నారు. నీ ప్రవర్తనతో దానిని చెడకొట్టుకోకు అని చెప్పాడు.
ఇది చూసిన వారు మాత్రం గణేష్ తన ప్రవర్తన మార్చుకోకపోతే త్వరలోనే బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమైంది.