కరోనా, లాక్ డౌన్ వల్ల సినిమాలన్నీ ఆగిపోయాయి. మూడు నెలలుగా.. వెండి తెర సందడి లేదు. సినిమాలన్నీ ఓటీటీలో చూసుకోవాల్సి వస్తోంది. అలాగని ఓటీటీలో పెద్దసినిమాలేం రావడం లేదు. పెద్ద సినిమాల్ని లాక్కోవాలన్న ఓటీటీ సంస్థల ప్రయత్నాలేం నెరవేరడం లేదు. వచ్చినవన్నీ.... చిన్నా చితకా చిత్రాలే. `టక్ జగదీష్`ని కొనేయాలని... ఓటీటీ సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఓ దశలో... నిర్మాతలు కూడా... ఈసినిమాని ఓటీటీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
కానీ... నాని మాత్రం అడ్డు పడినట్టు టాక్. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసినిమా ఓటీటీకి ఇవ్వకూడదని గట్టిగా చెప్పాడట. దాంతో నిర్మాతలు వెనకడుగు వేశారని సమాచారం. నాని.. ఓటీటీ అంటే భయపడుతున్నాడని, ఓటీటీ వల్ల సినిమాల మైలేజీ తగ్గిపోతుందని భావిస్తున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. నాని `వి` ఓటీటీలోనే విడుదలైంది. కానీ... ఆదరణ దక్కలేదు. తన టక్ జగదీష్ కీ అలాంటి ఫలితమే వస్తుందన్నది నాని భయం. పైగా ఓటీటీలో విడుదలైన పెద్ద సినిమాలన్నీ పల్టీలుకొడుతూనే ఉన్నాయి. అందుకే... నాని ఓటీటీకి ఈ సినిమా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదట.
ఆగస్టులో థియేటర్లు తెరచుకునే అవకాశాలున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీ లభించే ఛాన్సుంది. వంద శాతం ఆక్యుపెన్సీ.. ఛాన్స్ వచ్చిన వెంటనే టక్ జగదీష్ ని రిలీజ్ చేసేస్తారని తెలుస్తోంది.