ఇండియన్ వెబ్ సిరీస్‌లలో... ఓ ఆణిముత్యం `ఫ్యామిలీమెన్`. తొలి సీజన్ సూపర్ హిట్టవ్వడంతో.. రెండో సీజన్ ని రంగంలోకి దింపారు. దీనికీ అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ రెండు సీజన్‌ల ద్వారా అటు అమేజాన్, ఇటు రాజ్ డీకే బాగా లాభపడ్డారన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఈ రెండు వెబ్ సిరీస్ ల ద్వారా... రాజ్ డీకేలకు దాదాపుగా 100 కోట్ల వరకూ లాభం వచ్చిందని సమాచారం. ఈ రెండు వెబ్ సిరీస్‌లకూ అయిన బడ్జెట్ రూ.50 కోట్ల వరకూ ఉంటుందని టాక్. అందులో సగం పారితోషికాలకే అయిపోయిందని, మిగిలిన సగాన్ని మేకింగ్ కోసం ఖర్చు పెట్టారని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
ఫ్యామిలీమెన్ 2 సీజన్‌లో సమంత అందుకున్న పారితోషికంపై పెద్ద చర్చ నడుస్తోంది. రాజీ పాత్రలో కనిపించిన సమంత ఏకంగా 4 కోట్ల వరకూ పారితోషికం అందుకుందని టాక్. అయితే.. మనోజ్ బాజ్‌పేయ్ కి దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చార్ట. బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మనోజ్ కి మంచి పేరుంది. అయితే.. ఎవరూ ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వరు. పది సినిమాలకు సరిపడినంత పారితోషికం.. తను ఈ ఒక్క వెబ్ సిరీస్ తో సంపాదించాడు. ఇక మూడో సీజన్ కోసం కూడా మనోజ్ కి భారీ పారితోషికం ఇస్తున్నారని సమాచారం.