'గ్యాంగూ లీడరూ..' నాని - అనిరుధ్‌ చితక్కొట్టేశారూ!

By Inkmantra - September 06, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

'నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌' టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ జోరుగా ప్రమోషన్స్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'గ్యాంగూ.. గ్యాంగూ..' అనే ప్రమోషనల్‌ సాంగ్‌ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వీడియో సాంగ్‌లో నానితో పాటు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ మాస్‌ స్టెప్పులు ఇరగదీసేశారు. ఒకరితో ఒకరు పోటీ పడి మాస్‌, ఊర మాస్‌ అనేలా చిందేశారు.

 

పాట బీట్‌, మాస్‌ స్టెప్పులు అదిరిపోవడంతో ఈ వీడియో సాంగ్‌ని ఫ్యాన్స్‌ పదే పదే వీక్షిస్తున్నారు. దాంతో విడుదలైన కాసేపటికే 1 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది ఈ వీడియో సాంగ్‌. నాని, అనిరుధ్‌ స్టెప్పులతో పాటు, సినిమాలోని ఇతర కీలక పాత్రధారులైన సీనియర్‌ నటి లక్ష్మి, శరణ్య, హీరోయిన్‌ ప్రియా ఇద్దరు పాపల పాత్రలను పరిచయం చేస్తూ, ఆయా సన్నివేశాలు వీడియోలో చూపించారు. విలన్‌గా నటిస్తున్న కార్తికేయను కూడా ఈ వీడియోలో చూపించారు. సాంగ్‌ కొరియోగ్రఫీ చాలా చాలా ఆకట్టుకుంటోంది.

కలర్‌ఫుల్‌గా ఓ సెలబ్రేషన్‌లా ఉందీ సాంగ్‌. పరిపూర్ణ స్థాయిలో సినిమాకి ప్రమోషన్‌ దక్కేసింది ఈ టైటిల్‌ సాంగ్‌తో. నాని జోష్‌కి అనిరుధ్‌ హుషారు ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలిచింది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS