సీక్వెల్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన నాని

By Gowthami - March 08, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఇటీవ‌లే హిట్ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. విమ‌ర్శ‌కుల నుంచి `యావ‌రేజ్‌` మార్కులు తెచ్చుకున్నా - నిర్మాత‌కూ సినిమా కొన్న‌వాళ్ల‌కీ లాభాలొచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంద‌ని నాని ముందే చెప్పాడు. సినిమా చివ‌ర్లో కూడా పార్ట్ 2కి లీడ్ తీసుకున్నాడు. అయితే పార్ట్ 2 ఉంటుందా, లేదా? అనే సందేహాలు మొద‌ల‌య్యాయి. వాటిన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేశారు.

 

ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. జూన్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నారు. పార్ట్ 2లో విశ్వ‌క్ సేన్‌తో పాటు మ‌రో హీరో కూడా న‌టించ‌బోతున్నాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే పార్ట్ 2లో కొత్త పాత్ర‌లు వ‌చ్చి చేర‌తాయ‌ని, ఈ చిత్రాన్ని 2021 ప్ర‌ధ‌మార్థంలో విడుద‌ల చేస్తామ‌ని, ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ద‌ర్శ‌కుడు శైలేష్ తెలిపారు. హిట్ క‌థ ఎక్క‌డైతే ఆగిందో, అక్క‌డి నుంచి హిట్ 2 మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నాడు. మ‌రి... ఆ హిట్ 2 ఎలా ఉంటుందో తెలియాలంటే 2021 వ‌ర‌కూ ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS