ప్రముఖ యాంకర్ అనసూయ పైన నిన్న తార్నాక వద్ద జరిగిన ఒక సంఘటన కారణంగా పోలీస్ కేసు నమోదు చేశారు.
ఆ వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న అనసూయని చూసిన ఒక పిల్లవాడు వెంటనే తన వద్ద ఉన్న ఫోన్ తో ఆమెని ఫోటో తీసేందుకు ప్రయత్నించాడట. ఇది గమనించిన వెంటనే అనసూయ ఆ ఫోన్ ని లాక్కొని రోడ్డు కి వేసి కొట్టడంతో ఆ ఫోన్ పూర్తిగా ధ్వంసమైంది.
అయితే ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా షాక్ కి గురైన వారు వెంటనే ఈ విషయాన్ని ఒక మీడియా ఛానల్ కి సమాచారం ఇవ్వడం తో ఈ వార్త సంచలనంగా మారింది. ఇక ఈరోజు ఈ విషయమై వారు అనసూయ పై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
పోలీసులు కూడా ఈ ఫిర్యాదు తీసుకొని అనసూయ పైన కేసు నమోదు చేశారని సమాచారం. మొత్తానికి ఒక చిన్న విషయం ఇంతలా పెరిగి చివరికి కేసు వరకు వెళ్ళడం గమనార్హం.