బిగ్ బాస్ సీజన్ 2లో నిన్నటి ఎపిసోడ్ కాస్త ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ గా కనిపించే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం దానికి సంబంధించిన పంచాయితీ వ్యాఖ్యాతగా ఉన్న నాని ముందుకి రావడం విశేషం.
ఇక అటువంటి గొడవగా ఉన్న సమయంలో నాని చాలా సమర్ధవంతంగా వ్యవహరించాడు అని, అదే సమయంలో బాబు గోగినేని, కౌశల్ కి తాము ఏం చేయడం వల్ల ఇంతటి గొడవకి కారణమయింది అంటూ కాస్త గట్టిగానే ఈ ఇరువురికి చెప్పడంలో సఫలీకృతమయ్యాడు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది.
ఇదే సమయంలో అసలు బిగ్ బాస్ ఇంటికి సంబంధం లేని విషయాలని ఇక్కడ ప్రస్తావించడం వాటిని ఆధారం చేసుకుని ఎలిమినేషన్ కి నామినేట్ చేయకండి అంటూ ఇంటి సభ్యులందరిని పరోక్షంగా హెచ్చరించాడు.
ఇలా నాని వ్యవహరించిన తీరుకి ఎక్కువమంది మద్దతు తెలుపుతుంటే కౌశల్ కి ఫాలోవర్స్ అంటూ చెప్పుకుంటున్న కౌశల్ ఆర్మీ మాత్రం నానిని తప్పుబడుతుండడం కొసమెరుపు.