నూతన్ నాయుడు & శ్యామల : ఈ ఇద్దరిలో ఎవరు?

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ సీజన్ 2కి సంబంధించి ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయిన వారి నుండి ఒకరు మళ్ళీ ఇంటిలోకి ప్రవేశించే సమయానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.

ఇక అలా ఇంటిలోకి అడుగుపెట్టే అవకాశం వెళ్ళిపోయిన నూతన్ నాయుడు లేదా శ్యామలకి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే ఈరోజుకి సంబందించిన షూటింగ్ పూర్తవ్వగా ఆ అవకాశం ఈ ఇద్దరిలో ఎవరికి దక్కింది అంటూ అందరిలోనూ ఏదో ఒక తెలియని ఆసక్తి నెలకొని ఉంది.

అయితే ఈ ఇద్దరికీ సమానం అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తమవుతుంది. శ్యామల వెళ్ళిపోవడానికి కారణం స్పెషల్ ఓటింగ్ కావడంతో ఇంటిలోకి మరోసారి ప్రవేశించోచ్చు అన్నభావన కూడా మరికొంతమందిలో ఉంది.

ఏదేమైనా ఈ సస్పెన్స్ కి ఇంకొన్ని గంటల్లో తెరపడనుంది. కాకపోతే ఈ విషయం తెలియని ఇంటి సభ్యులు మాత్రం తమలో ఎవరో ఒకరు బయటకి వెళతారు అన్న ఆందోళనలో ఉండడం కొసమెరుపు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS