సంక్రాంతి బరిలో నేచురల్‌ స్టార్‌ కూడా.!

By iQlikMovies - January 11, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

అదేంటీ సడెన్‌గా నాని కూడా సంక్రాంతి పోరుకు సిద్ధమయ్యాడా.? అని ఆశ్చర్యపోకండి. నేచురల్‌ స్టార్‌ నాని నటించిన 'జెర్సీ' మూవీ టీజర్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారట. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మళ్లీ రావా' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకుడు. 'కిర్రాక్‌ పార్టీ' ఫేం శ్రద్ధా శ్రీనాథ్ నానికి జోడీగా నటిస్తోంది.

 

కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా టీజర్‌ని సంక్రాంతి స్పెషల్‌గా 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇటీవల వచ్చిన 'జెర్సీ' ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రీడా నేపథ్యంలో రానున్న విభిన్న కాన్సెప్ట్‌ మూవీ 'జెర్సీ'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలు అందుకుని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో కాస్త దెబ్బ తిన్న నానికి 'దేవదాస్‌' కాస్త ఊరటనిచ్చింది. 

 

అయితే అంతకు మించిన సక్సెస్‌ని 'జెర్సీ' రూపంలో తన ఖాతాలో వేసుకోనున్నాడనీ చిత్ర వర్గాల అభిప్రాయం. కెరీర్‌ తొలినాళ్లలో నాని 'భీమిలి - కబడ్డీ జట్టు' సినిమాలో నటించాడు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మాస్‌ జోనర్‌లో తెరకెక్కింది. కానీ 'జెర్సీ'కి క్లాస్‌ టచ్‌ ఎక్కువ. అన్నట్లు 'జెర్సీ'కి తమిళ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ కానుంది. సో మన పక్కింటబ్బాయ్‌ ఈ క్లాస్‌ మూవీతో ఎలాంటి స్వీట్‌ సక్సెస్‌ అందుకుంటాడో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS