నాని ప్రయోగం ఈ సారైనా ఫలించేనా.?

By iQlikMovies - January 09, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

డైరెక్టర్‌ కావాలనుకుని వచ్చి అనుకోకుండా హీరో అయిపోయిన కుర్రోడు నాని. నేచురల్‌ స్టార్‌గా పక్కింటి అబ్బాయిగా తిష్ట వేసేశాడు. హీరోగా వరుస విజయాలతో దూకుడు మీదున్న తరుణంలో నిర్మాతగా మారి ఓ విలక్షణ చిత్రాన్ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. అయితే ఆ విలక్షణం వికటించింది. ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేదు. అదే 'అ' చిత్రం. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ప్రశాంత్‌ వర్మ అనే యంగ్‌స్టర్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేశాడు నాని. 

 

ఇకపోతే తాజాగా నాని నిర్మాణంలో మరో మూవీ రూపుదిద్దుకోనుందట. ఇది కూడా ప్రయోగాత్మక చిత్రమేనని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కథ ఖచ్చితంగా బలమవుతుందనడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈ సినిమాకి కథని అందిస్తున్నది విజయేంద్రప్రసాద్‌. 'బాహుబలి' వంటి గొప్ప ఫాంటసీలతో పాటు బాలీవుడ్‌లోనూ 'బజరంగీ భాయీజాన్‌' తదితర హిట్‌ చిత్రాలకు కథనందించారు విజయేంద్ర ప్రసాద్‌. ఇప్పుడు రాజమౌళి మల్టీ స్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి కూడా ఈయనే కథా రచయిత. 

 

కథ పరంగా ఈ సినిమాకి ఇంత బలముంది. మరి కాస్టింగ్‌. ఇదో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ అని సమాచారమ్‌. మరో కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడట. హీరోయిన్‌గా స్టార్‌ హీరోయిన్‌ని ఎంపిక చేసుకునే యోచనలో నాని అండ్‌ టీమ్‌ ఉన్నారట. ఆ లిస్టులో సమంత, నిత్యామీనన్‌ ఉన్నారనీ తెలుస్తోంది. పెళ్లి తర్వాత సమంత ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తోంది. సో నాని అడిగితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు వెనుకాడదేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS