భలే భలే కాంబో రెడీ అవుతోందా?

మరిన్ని వార్తలు

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక దర్శకుడు - హీరో కాంబినేషన్ లో తెరకెక్కిన ఒక సినిమా ఘనవిజయం సాధిస్తే మరోసారి వారిద్దరూ కలిసి చేసే సినిమాకు భారీ క్రేజ్ ఉంటుంది. ఒక్కోసారి ఆ క్రేజ్ పైనే బిజినెస్ కూడా జరుగుతుంది. తాజాగా అలాంటి క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోందని ఫిల్మ్ నగర్ నుంచి సమాచారం అందుతోంది. కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మారుతి కెరీర్లో 'భలే భలే మగాడివోయ్' ఒక మరపురాని చిత్రం అని చెప్పుకోవాలి.

 

హీరో నానిని ఓ నాలుగు మెట్లు ఎక్కించి న్యాచురల్ స్టార్ గా మార్చిన చిత్రమది. అప్పటి నుంచి మారుతి, నాని కలిసి మరో సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి వారిద్దరి కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. ఈమధ్య మారుతి ఓ మంచి కథతో నానిని మెప్పించారట. దీంతో ఈ సినిమాలో నటించేందుకు నాని వెంటనే పచ్చజెండా ఊపడం జరిగిందట. నాని -మారుతి కాంబినేషన్లో సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా రానుందని సమాచారం. అయితే ఈ సినిమా వెంటనే పట్టాలెక్కిన అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే నాని ఈ సినిమా కంటే ముందుగా 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరాయ్' సినిమాలను పూర్తిచేయాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాతే మారుతి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS