కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నాగార్జున, వర్మతో 'ఆఫీసర్' సినిమా పూర్తి చేసుకుని వచ్చి, ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందట.
నాగార్జున, నాని ఇద్దరూ ఇద్దరే. యాక్టింగ్‌లో ఇరగదీసేస్తున్నారంటూ, చిత్ర యూనిట్ చెబుతోంది. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ప్రెస్టీజియస్ మూవీస్‌ని రూపొందించి, వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మల్టీ స్టారర్స్ అంటే నాగార్జునకి కొత్తేమీ కాదు. కానీ నానితో మల్టీ స్టారర్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. గతంలో నాగార్జున, మంచు విష్ణు, సుమంత్..ఇలా తదితర యంగ్ హీరోస్తో మల్టీ స్టారర్స్లో నటించాడు. కానీ ఈ సినిమా కథ వాటన్నింటి కన్నా, భిన్నంగా, ప్రత్యేకంగా ఉండబోతోందట.
ఇంతకీ ఈ సినిమాలో నాని, నాగార్జున మధ్య రిలేషన్ ఏంటనే విషయంపైనే అంతటా ఆశక్తి నెలకొంది. అన్నట్లు ఈ సినిమా అప్పుడే ఓ ప్రత్యేకతను సంపాదించేసింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ని హైద్రాబాద్ మెట్రో ట్రైన్లో జరపడం విశేషం. అంతేకాదు, హైద్రాబాద్ మెట్రోలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ఇదేనట. నాని, హీరోయిన్ రష్మికాపై ఈ షూటింగ్ జరిగింది.
మరో పక్క నాని నటించిన 'కృష్ణార్జున యుద్దం' ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున 'ఆఫీసర్' మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.