ఛల్ మోహన్ రంగ శాటీలైట్ రైట్స్ కి మంచి డిమాండ్

By iQlikMovies - March 28, 2018 - 12:47 PM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నితిన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం- ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకి రానుంది. మొన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి పవన్ ముఖ్య అతిధిగా రావడంతో ఈ సినిమా పైన అంచనాలు మరింతగా పెరిగాయి. 

ఈ తరుణంలో ఛల్ మోహన్ రంగ సినిమాకి సంబందించిన బిజినెస్ అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా శాటీలైట్ రైట్స్ కోసం ఒక ప్రముఖ ఛానల్ సుమారు రూ 4.5 కోట్ల వరకు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారట.

అయితే నితిన్ గత చిత్రం ఫ్లాప్ అయినప్పటికి, బిజినెస్ పరంగా ఇంతలా క్రేజ్ రావాడానికి కారణం- పవన్ కళ్యాణ్ & త్రివిక్రమ్ అని వేరే చెప్పకర్లేదు. పవన్ నిర్మాతగా వ్యవహరించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకి కథ అందించాడు. 

మరి ఈ బిజినెస్ క్రేజ్ సినిమా విడుదలయ్యాక కూడా కొనసాగితే ఈ సినిమాతో మళ్ళీ హిట్ దారి పడతాడు నితిన్. ఇవన్ని తెలియాలంటే ఏప్రిల్ 5వరకు ఆగాల్సిందే... 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS