ఈ ఏడాది ఆల్రెడీ 'శతమానం భవతి' సినిమాతో హిట్ ఖాతా ఓపెన్ చేసేశాడు దిల్‌రాజు. ఇప్పుడు మరో హిట్‌కి రెడీ అయిపోతున్నాడు. అదే నాని సినిమా 'నేను లోకల్'తో. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు చేస్తున్న ప్రమోషన్ అంతా ఇంతా కాదు. మామూలుగానే దిల్ రాజు తన సినిమాలకి ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే ఈ సినిమాకి కూడా ప్రచారం కిర్రాక్ పుట్టిస్తోంది. అలాగే నాని నటన, కీర్తి సురేష్ అందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రచార చిత్రాల్లో నాని, కీర్తిల మధ్య కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. అలాగే ఈ ఇద్దరూ జోడీ స్క్రీన్‌పై చాలా చాలా బాగుందంటూ ఆల్రెడీ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. మామూలు లవ్ స్టోరీనే కానీ ఆ స్టోరీని తెరకెక్కించని వైనం అద్భుతంగా ఉండబోతోందట. నాని అంటేనే రొమాంటిక్ స్టోరీస్‌కి పెట్టింది పేరు. అయితే ఈ స్టోరీస్‌కి నాని నటనతో మరింత పేరు తెచ్చిపెట్టేస్తూ ఉంటాడు. గతేడాది నాని నుండి వచ్చిన సినిమాలన్నీ, రొమాంటిక్ లవ్ స్టోరీసే. కానీ ఒక సినిమాకీ, మరో సినిమాకీ ఏమాత్రం పొంతన లేకుండా అన్ని సినిమాలు దేనికవే అన్నట్లుగా ఉంటాయి. అలాగే ఇప్పుడు రాబోతున్న తాజా చిత్రం 'నేను లోకల్' కూడా ఆ తరహా లవ్ స్టోరీనే. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.