మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో పీక్ స్టేజిలో ఉన్నట్టు చెప్పొచు. ఎందుకంటే అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా ఒకే సమయంలో హిట్ కొట్టడం అనేది మాటలు కాదు.
ఇక అసలు విషయానికి వస్తే, రామ్ చరణ్ తన 11వ సినిమా సుకుమార్ తో ఈ మధ్యనే మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాకి ముందు యంగ్ డైరెక్టర్ మెర్లపాక గాంధీ చెప్పిన కధకి చరణ్ ఒకే చెప్పేశాడు అని వార్తాలు వచ్చాయి. తరువాత ఏమైందో ఏమో తెలిదు కాని ఈ సినిమా గురించి ఎటువంటి న్యూస్ బయటకి రాలేదు.
అయితే ఉన్నట్టు ఉండి ఈ కాంబినేషన్ మళ్ళీ తెరపైకి వచ్చింది. అందుతున్న వార్తల ప్రకారం, గాంధీ ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ డిజైన్ చేశాడట. చరణ్ కూడా ఈ స్టొరీ లైన్ అలాగే తన రోల్ విన్నాక ఎక్సైట్ అయినట్టు సమాచారం.
మరి ఈ చిత్రం సుకుమార్ తరువాత వెంటనే చేస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే. చూద్దాం.. గాంధీకి దొరికిన ఈ మెగా ఆఫర్ ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో!!