నాని మరోసారి నిరూపించుకున్నాడు

మరిన్ని వార్తలు

నాని నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. తాజా సినిమా 'నేను లోకల్‌'తో అదరగొట్టేశాడు. వరుస విజయాలతో గతేడాది అంతా తన అభిమానులకు పండగ చేసిన నాని, ఈ ఏడాది కూడా 'నేను లోకల్‌' సినిమాతో మంచి విజయాన్ని ఇచ్చాడు. అన్ని అంశాలున్న మంచి సినిమాగా నాని 'నేను లోకల్‌' ఆకట్టుకుంటోంది. నాని డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగానే ఈ సినిమాలో తన పాత్రను డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. తన ఈజ్‌తో ఆ పాత్రకి మరింత ఎట్రాక్షన్‌ తీసుకొచ్చేశాడు. లోకల్‌ కుర్రాడి పాత్రలో నాని నటన బాగా ఆకట్టుకుంది. అలాగే ఇంతవరకూ లవర్‌ బోయ్‌ క్యారెక్టర్స్‌లో పక్కింటి అబ్బాయిగా కనిపించే పాత్రలతో ఆకట్టుకున్న నాని, ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేశాడు. మాస్‌ అప్పీల్‌ కనిపించింది నానిలో. మాస్‌గా కనిపిస్తూనే క్లాస్‌గా ఉంది తన పాత్ర ఈ సినిమాలో. ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేసిన కుర్రోడిలా హీరోయిన్‌ని టీజ్‌ చేసే సీన్స్‌లో నాని తనదైన శైలిని ప్రదర్శించాడు. నాని సినిమా అంటే సకుటుంబ సపరివారంగా కలిసి చూడొచ్చు అనే విషయం ఈ సినిమాతో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. అలాగే క్లాస్‌ ఆడియన్స్‌కి, మాస్‌ ఆడియన్స్‌కి కూడా ఇంట్రెస్టింగా అనిపిస్తుంది ఈ స్టోరీ. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ తన నేచురల్‌ యాక్టింగ్‌తోనూ, చబ్బీ గ్లామర్‌తోనూ క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేసింది. నక్కిన త్రినాధరావు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా టోటల్‌గా మంచి ఎంటర్‌టైనింగ్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ అన్పించుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఏడాది నాని, కీర్తి సురేష్‌ ఓ మంచి హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ఈ సినిమాతో. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS