ఇంద్రగంటి కోసం నాని ప్రయోగం.?

మరిన్ని వార్తలు

డైరెక్టర్‌గా అవుదామని వచ్చిన నానిని యాక్టర్‌గా పరిచయం చేసిన డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. తొలి సినిమాకే హిట్‌ కొట్టాడు. పక్కింటబ్బాయ్‌ ట్యాగ్‌ అంది పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రగంటితో 'జెంటిల్‌మెన్‌' చిత్రంలో నటించిన నాని, ముచ్చటగా మూడోసారి 'వి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరికొత్త క్యారెక్టర్‌ పోషిస్తున్నాడనే హింట్‌ ఎప్పుడో ఇచ్చేశాడు.

 

అయితే, ఈ సినిమాకి సంబంధించి తాజా అప్‌డేట్‌ ఒకటి వేడి వేడిగా ప్రచారంలో ఉంది. ఇప్పటికే చాలా మంది యంగ్‌ హీరోలు సిక్స్‌ప్యాక్‌తో ఆకట్టుకున్నారు. కానీ, ఎందుకో నాని దాని జోలికి పోలేదింతవరకూ. కానీ, ఇంద్రగంటి సినిమా కోసం ఆ ముచ్చట తీర్చుకోబోతున్నాడట. ఈ సినిమాలో నాని సిక్స్‌ప్యాక్‌తో కనిపించబోతున్నాడనీ సమాచారం. అంతే కాదు, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నాని కనిపించబోతున్నాడనే ప్రచారం ఎలాగూ ఉంది.

 

హీరోగా సుధీర్‌బాబు నటిస్తున్న ఈ చిత్రంలో, ముద్దుగుమ్మలు నివేదా థామస్‌, అదితీ రావ్‌ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల 'జెర్సీ'తో హిట్‌ కొట్టిన నాని, త్వరలో 'గ్యాంగ్‌ లీడర్‌'తో రానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'వి' తో మెస్మరైజ్‌ చేయనున్నాడు. జెర్సీలో సీరియస్‌ టోన్‌లో కనిపించిన నాని, 'గ్యాంగ్‌లీడర్‌'లో ఫుల్‌ ఫన్‌ పంచనున్నాడు. ఇక 'వి'లో విలనిజం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. సో వరుసగా ఈ మూడు సినిమాలతో నాని డిఫరెంట్‌ షేడ్స్‌ ప్రదర్శించనున్నాడన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS