'మహానటి' డైరెక్టర్‌ నెక్ట్స్‌ నానితోనే.!

మరిన్ని వార్తలు

అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. దాంతో ఈ డైరెక్టర్‌ చేయబోయే నెక్ట్స్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అసలింతకీ మనోడు తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడనేదే ప్రశ్న. అయితే నాగి మనసులో ఉన్న హీరో నేచురల్‌ స్టార్‌ నాని అని ప్రచారం జరుగుతోంది. 

నాని సినిమాతోనే ఈ డైరెక్టర్‌ టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా నాగ్‌ అశ్విన్‌కి డైరెక్టర్‌గా తొలి సినిమా. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కించే యోచనలో నాగ్‌ అశ్విన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి 'మహానటి'లో నాని నటించాల్సి ఉంది. దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర కోసం ముందుగా నానితోనే చర్చలు జరిగాయట. అయితే ఆ పాత్రలో నెగిటివ్‌ షేడ్స్‌ ఎక్కువగా ఉండడంతో నాని అభ్యంతరం వ్యక్తం చేశాడట. తదుపరి ఆ ఛాన్స్‌ దుల్కర్‌ సల్మాన్‌కి దక్కింది. 

సినిమా విడుదలై ఇంతటి కీర్తి సాధించిన తర్వాత ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నందుకు నాని ఫీలయ్యాడట. అయితే సావిత్రి పాత్ర కోసం కీర్తిని ఆఫర్‌ చేసింది మాత్రం నానినే అట. ఆ విషయం కీర్తిసురేషే చెప్పింది. నాని కారణంగానే ఈ సినిమా ఒప్పుకున్నానని కీర్తి చెప్పింది. డైరెక్ట్‌గా కాకున్నా, నాని కూడా ఈ సినిమాలో భాగం పంచుకున్నాడు. 'మహానటి' టీజర్‌ వీడియోలకు తన వాయిస్‌నందించాడు నాని. ఇ

కపోతే నాని ప్రస్తుతం నాగార్జునతో మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఆ తర్వాత నాని చేయబోయేది నాగ్‌ అశ్విన్‌ సినిమానే అవుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS