నాని సినిమాకి విచిత్ర‌మైన పేరు

By Gowthami - February 24, 2020 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

నాని దూకుడుమీదున్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం `వి` సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. మార్చిలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రోవైపు `ట‌క్ జ‌గ‌దీష్` సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్పుడు మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. `టాక్సీవాలా`తో ఆక‌ట్టుకున్న రాహుల్‌.. ఇప్పుడు నానితో జ‌ట్టుక‌ట్ట‌బోతున్నాడు. వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఓ విచిత్ర‌మైన టైటిల్ పెట్టారు. అదే... `శ్యాం సింఘ రాయ్‌`.

 

ఈరోజు నాని పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమానీ, టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌. నిజానికి రాహుల్ క‌థ‌ని చాలామంది హీరోల‌కు వినిపించాడు. అయితే వాళ్లెవ‌రూ ఈ క‌థ‌కు క‌నెక్ట్ అవ్వ‌లేదు. కానీ నానికి మాత్రం విప‌రీతంగా న‌చ్చేసింది. అందుకే ఈ సినిమాకి ప‌చ్చ‌జెండా ఊపేశాడు. `ట‌క్ జ‌గ‌దీష్‌`తో స‌మాంత‌రంగా ఈ సినిమాని పూర్తి చేస్తారు. ఈ యేడాదే ఈ చిత్రం విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS