'నేను లోకల్' సినిమాతో స్టార్ హీరోల రేంజ్‌కి వెళ్లిపోయాడు నేచురల్ స్టార్ నాని. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కొల్లగొడుతోంది ఈ సినిమా. వరుస హిట్లతో ఉబ్బి తబ్బిబ్పైపోతున్నాడు నాని. త్వరలోనే ఓ కొత్త డైరెక్టర్‌తో విభిన్న స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడట. ఇంత వరకూ లవ్ స్టోరీస్‌లోనే డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వచ్చాడు నాని. వాటిలోనే తన నటనతో వేరియేషన్ చూపించి, కామన్ స్టోరీనే కానీ నాని తన టాలెంట్‌తో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అయితే ఈ సారి అలా కాదంట. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడంటున్నారు. కొత్త డైరెక్టర్ శివ దర్శకత్వంలో నాని సినిమా చేయబోతున్నాడనీ సమాచారమ్. ఈ సినిమాను వేంకటేశ్వర్ ఆర్ట్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించనున్నారట. గతంలో రవితేజతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్ శివ. అయితే అది సెట్స్ మీదికి వెళ్లలేదు. కానీ నాని కోసం ఓ విలక్షణ స్టోరీని ప్రిపేర్ చేశాడట ఇప్పుడు. అసలే నాని కెరీర్ జోరుగా ఉంది. ఇలాంటి టైంలో నాని ఏ అటెంప్ట్ చేసినా అది సక్సెస్ అయ్యే కళలే కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలే ప్రయోగాలు చేసేస్తూ సూపర్ సక్సెస్ అయిపోతున్నారు. ఇలాంటి తరుణంలో నాని కూడా ఓ ప్రయోగానికి తెర లేపనున్నారట. అంతేకాదు ఈ సినిమాలో నాని లక్కీ బ్యూటీ మెహరీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' మంచి విజయం అందుకుంది. ఒకవేళ ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే అది కూడా మంచి సక్సెస్ కావడం ఖాయం అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.