బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఎంతటి ఆదరణ సంపాదించుకున్నదో మనందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ ఈ మొత్తం షోకే హైలైట్ అని చెప్పితీరాలి.
అయితే ఇప్పుడు సెకండ్ సీజన్ మొదలయ్యే తరుణంలో ఎన్టీఆర్ ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా చెయ్యట్లేదు అన్న వార్త బయటికొచ్చింది. అదే కాకుండా ఎన్టీఆర్ స్థానంలో మరో హీరో నాని రెండవ సీజన్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.
ఇప్పటికీ దీనిపైన అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఎన్టీఆర్ సీజన్ 2లో కనపడడు అని మాత్రం చెబుతున్నారు. అలాగే హీరో నానికి వ్యాఖ్యాతగా చేస్తున్నందుకు సుమారు రూ 4కోట్ల మేర రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి.
మరి ఈ వార్తలో ఎంత నిజముందో ఏమో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం ఇదే హాట్ టాపిక్..