యువ హీరోల స్పీడు మామూలుగా లేదు. ఓసినిమా హిట్టయితే.. ఏమాత్రం ఆలోచించకుండా పారితోషికాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్లు పది కోట్ల మార్క్ ని చేరుకోవడం చాలా ఈజీ అయిపోయింది. నాని.. ఎప్పుడో పది కోట్ల మార్క్ అందేసుకున్నాడు. తన సినిమా ఇప్పుడు 40 నుంచి 50 కోట్ల బిజినెస్ చేస్తోంది. కాబట్టి.. ఆ మాత్రం అందుకోవడంలో విచిత్రం ఏమీలేదు. కాకపోతే.. ఇప్పుడు తన పారితోషికాన్ని మరో 4 కోట్లకు పెంచి 14 కోట్లు చేశాడన్నది టాక్.
`శ్యామ్ సింగరాయ్`, `టక్ జగదీష్` చిత్రాలకు నాని అక్షరాలా పది కోట్లు అందుకున్నాడని తెలిసింది. ఇప్పుడు కొత్త నిర్మాతలకు తన పారితోషికాన్ని 14 కోట్లుగా ఫిక్స్ చేశాడట. అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు చేస్తున్నాడట. శ్యామ్ సింగరాయ్, టక్ జగదీష్‌లలో ఏ ఒక్కటి హిట్ అయినా... నాని పారితోషికం రౌండ్ ఫిగర్ మార్క్ 15 కోట్లకు చేరడం ఖాయం. అన్నట్టు.. ఇందులో జీఎస్‌టీ లేదండోయ్. అవి ఎలాగూ నిర్మాతలే కట్టుకోవాలి.