వైష్ణ‌వ్ తేజ్ చేతిలో ఆరు సినిమాలా?

By iQlikMovies - March 08, 2021 - 11:02 AM IST

మరిన్ని వార్తలు

ఉప్పెన‌తో ఉవ్వెత్తున లేచిన మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్‌. మెగా కాంపౌండ్ హీరో కావ‌డం త‌న‌కు కలిసొచ్చింది. ఆసినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో వైష్ణ‌వ్ కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వైష్ణ‌వ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం కాబోతున్నాడు. మ‌రోవైపు బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఓ సినిమా రాబోతోంది. దర్శ‌కుడు ఖ‌రారు కావాలి. ఇవి కాక మ‌రో నలుగురు నిర్మాత‌ల నుంచి అడ్వాన్సులు తీసుకున్నాడ‌ట‌.

 

అందులో మైత్రీ మూవీస్ కి మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. తొలి సినిమాకి దాదాపు 25 ల‌క్ష‌లు పారితోషికం అందింది. ఆ త‌ర‌వాత‌.. నిర్మాత‌లు మ‌రో 50 ల‌క్ష‌లు ఇచ్చారు. రెండో సినిమాకి కోటి వ‌ర‌కూ తీసుకున్నాడు. మూడో సినిమా నుంచి త‌న పారితోషికం రెండు కోట్ల‌ని తేలింది. మొత్తానికి వైష్ణ‌వ్ కెరీర్‌.... జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. క్రిష్ సినిమా `జంగిల్ బుక్‌` త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. కొండ‌పొలెం అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS