సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం `రిపబ్లిక్`. దేవాకట్టా దర్శకుడు. రమ్యకృష్ణ, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదల కానుంది. అయితే... ఈ సినిమా రివ్యూ ముందుగానే వచ్చేసింది. కానీ ఈ రివ్యూ ఏ సినీ విశ్లేషకుడి నుంచో కాదు. యువ కథానాయకుడు నాని నుంచి. `రిపబ్లిక్` సినిమాని నాని చూశాడట. ఈ సినిమా తనకెంతో నచ్చిందని సాయిధరమ్ తేజ్, దేవాకట్టాల కమ్ బ్యాక్ సినిమా స్ట్రాంగ్ గా ఉందని... ట్వీట్ చేశాడు. సాధారణంగా నాని వేరే సినిమాల గురించి ట్వీట్ చేయడు. అందులోనూ... విడుదలకు ముందే. కానీ ఈ సినిమా గురించి నాని మాట్లాడాడంటే... కచ్చితంగా విషయం ఉన్నట్టే.
రిపబ్లిక్ లో సాయిధరమ్ తేజ్ జిల్లా కలెక్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లు, టీజర్లు.. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. రోడ్డు ప్రమాదం వల్ల... సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తేజ్ లేకుండానే ఈ సినిమా ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. ఈ సినిమాని హిట్ చేసి, తేజ్ కి మంచి బహుమతి ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. కమర్షియల్ గా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం వుంది.