ట్రోలింగ్ పై స్పందించిన నాని

మరిన్ని వార్తలు

ట్రోలింగ్ బారిన పడుతున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు అందులో తాజాగా హీరో నాని కూడా ఉన్నాడు. ఈయన పైన నటి శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా ఆయన ఉల్లిక్కిపడ్డాడు. అసలు నేను చేయని దానికి ఏంటి ఇది అంటూ- సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అంటూ తన పై వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి కి లీగల్ నోటిసులు పంపించాడు.

ఇదే సమయంలో ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ కి సంబంధించి ప్రక్రియ అంతా ఆన్ లైన్ పద్దతిలో నడుస్తుంది. దీనికి సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఓటు వేయడం అలాగే వారికి నచ్చిన వారికోసం ప్రచారం చేస్తుంటారు. ఇదే విషయమై బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారి కోసం బయట అంతర్జాలంలో ఇలా ఇంతమంది ప్రోత్సహిస్తుండడం చాలా గ్రేట్ అని చెప్పాడు. 

అదే సమయంలో మంచికోసం అయితే పర్లేదు కాని కొంతమంది కావాలని ట్రోలింగ్ పేరిట ఎంతో మంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాడు. అయితే ఇది తన సొంత అనుభవంలో నుండి కూడా తీసుకుని చెప్పి ఉంటాడు అని అంటున్నారు. 

ఏదేమైనా... ఏ విషయమైన ఒక పరిధికి మించి వెళితే అది ప్రమాదమే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS